Posts

దయచేసి పిల్లల చేతికి ఫోన్స్ ఇవ్వకండి, ఎందుకు అంటే నా సమస్య చదవండి

నాకు ఇద్దరు పిల్లలు, మొదటి అబ్బాయి పుట్టినప్పుడు మాకసలు ఏమి తెలీదు ఇద్దరం జాబ్స్ చేసే వాళ్ళం , అన్నం పెట్టాలన్న ఏదైనా అడిగినప్పుడు ఊరుకో బెట్టాలన్న మొబైల్ ఇచ్చేసేవాళ్ళం . అబ్బా ఎంత సులువుగా ఇపొయిందో పని అనుకునేవాళ్లం కానీ దాని వాళ్ళ అబ్బాయి ఎంత సమస్యలో ఇరుక్కుంటున్నాడో తెలుసుకోలేకపోయాం. కొద్దీ రోజులకి బాబు మేము చెప్పిందానికంటే మొబైల్ లేదా టీవీ లో చెప్పేవాళ్లను అనుకరించడం మొదలు పెట్టాడు. బయటకి తీసుకువెళ్తే పెట్టుకోడం కష్టం అయ్యేది, మొబైల్ ఇస్తే ఊరుకుంటాడు లేకపోతే అటు ఇటు లాగడం చేసేవాడు, బాగా ఇబ్బంది పెట్టేవాడు, ఎందుకు తీసుకు వాచం ర అన్నంత కోపం వచ్చేది , కానీ ఎం చెయ్యాలి అది మేము చేసుకున్న అనే కదా అని మమ్మల్ని మేము అనుకుని ఉరుకుండే వాళ్ళం. తరువాత పాప పుట్టింది మొబైల్ కానీ టీవీ కి కానీ చాల దూరం పెట్టాం. అస్సలు ఇవ్వలేదని కాదు చాల చాల తక్కువ. బాబు ఆ వయసులో ఉన్నప్పుడు ఫోన్ చేతికి అందితే తిరిగి ఇవ్వాలంటే గోల గోల చేసేవాడు  ఐతే  పాప ఫోన్ వస్తే తీసుకుంటుంది కానీ మా చేతికి ఇచ్చేస్తుంది. వెంట్రుకలు ఇవ్వడానికి మంగలి వాడి దగ్గరకు వెళ్తే బాబుకి ఐతే ఫోన్ ఇస్తే ఏడిచేవాడు ఏడవడం ఆపి ఫోన్ చూస్తూ ఇంకేం పలక