దయచేసి పిల్లల చేతికి ఫోన్స్ ఇవ్వకండి, ఎందుకు అంటే నా సమస్య చదవండి

నాకు ఇద్దరు పిల్లలు, మొదటి అబ్బాయి పుట్టినప్పుడు మాకసలు ఏమి తెలీదు ఇద్దరం జాబ్స్ చేసే వాళ్ళం , అన్నం పెట్టాలన్న ఏదైనా అడిగినప్పుడు ఊరుకో బెట్టాలన్న మొబైల్ ఇచ్చేసేవాళ్ళం . అబ్బా ఎంత సులువుగా ఇపొయిందో పని అనుకునేవాళ్లం కానీ దాని వాళ్ళ అబ్బాయి ఎంత సమస్యలో ఇరుక్కుంటున్నాడో తెలుసుకోలేకపోయాం. కొద్దీ రోజులకి బాబు మేము చెప్పిందానికంటే మొబైల్ లేదా టీవీ లో చెప్పేవాళ్లను అనుకరించడం మొదలు పెట్టాడు. బయటకి తీసుకువెళ్తే పెట్టుకోడం కష్టం అయ్యేది, మొబైల్ ఇస్తే ఊరుకుంటాడు లేకపోతే అటు ఇటు లాగడం చేసేవాడు, బాగా ఇబ్బంది పెట్టేవాడు, ఎందుకు తీసుకు వాచం ర అన్నంత కోపం వచ్చేది , కానీ ఎం చెయ్యాలి అది మేము చేసుకున్న అనే కదా అని మమ్మల్ని మేము అనుకుని ఉరుకుండే వాళ్ళం. తరువాత పాప పుట్టింది మొబైల్ కానీ టీవీ కి కానీ చాల దూరం పెట్టాం. అస్సలు ఇవ్వలేదని కాదు చాల చాల తక్కువ.

బాబు ఆ వయసులో ఉన్నప్పుడు ఫోన్ చేతికి అందితే తిరిగి ఇవ్వాలంటే గోల గోల చేసేవాడు  ఐతే  పాప ఫోన్ వస్తే తీసుకుంటుంది కానీ మా చేతికి ఇచ్చేస్తుంది.

వెంట్రుకలు ఇవ్వడానికి మంగలి వాడి దగ్గరకు వెళ్తే బాబుకి ఐతే ఫోన్ ఇస్తే ఏడిచేవాడు ఏడవడం ఆపి ఫోన్ చూస్తూ ఇంకేం పలక్కుండా తీయించుకునే వాడు వెంట్రుకలు, కానీ పాప మొబైల్ ఇస్తే ఇసిరి కొట్టేసి ముగ్గురు నలుగురు పట్టుకున్న గోల చేస్తుంది కత్తిరించుకోడానికి .

ఎక్కడైనా ఉంటె ఫోన్ చూపిస్తే చాలు బాబు పరిగెత్తుకు వచ్చేవాడు ఐతే పాప మాత్రం ఆ అమ్మాయికి ఏమి కావాలంటే అదే చేస్తుంది ఫోన్ చూసి ఆగదు

డాక్టర్ ని కలిసి ఆయన చెప్పిన సలహా ప్రకారం ఫోన్స్ , టీవీ కి దూరంగా ఉంచుతూ , బొమ్మలు పిల్లల బుక్స్ ని అలవాటు చేస్తూ మా బాబు ని ఇప్పుడు ఒక దారికి తీసుకుని వచ్చాము. 

ఎందుకు నేను ఇదంతా చెబుతున్న అంటే నిన్న దగ్గర లో ఉన్న ఒక గుడికి వెళ్ళాను ఏ పక్క చుసిన పిల్లలు మొబైల్ పట్టుకుని చూసుకుంటున్నారు, నేను వెళ్లి ఆలా ఇవ్వకండి అని చెప్పా అనుకో వాళ్ళు మీకెందుకు మా ఇష్టం అంటారు అందుకే ఈ బ్లాగ్ ద్వారా నేను ఎదుర్కున్న సమస్యని చెబుదామనుకున్నాను కనీసం చదివిన వాళ్ళు నచ్చకపోతే నన్ను మొఖాన ఏమి అనలేరు కదా ఒకవేళ అర్థం చేసుకుంటే వాళ్ళ పిల్లలకి ఆ సమస్య రాకుండా చూసుకుంటారు. 

దయచేసి అర్థమయిన వాళ్ళు చిన్న పిల్లలకి ఫోన్స్ ఇవ్వకండి ముఖ్యంగా ఒకటి నుండి ఐదు లోపల వయస్సు ఉన్నవాళ్ళకి అస్సలు ఇవ్వకండి ఆ వయసులోనే బ్రెయిన్ వృద్ధి జరుగుతుంది చాల ముఖ్యమైన రోజులు పిల్లలకి అవి. 

Comments